IPL: ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ నయా రికార్డ్.. 27 d ago
ఐపీఎల్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసొచ్చింది. ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా వెలుగొందుతున్న ఐపీఎల్‌లో క్రికెటర్లపై కనక వర్షం కురిసింది. జెడ్డా(సౌదీ అరేబియా) వేదికగా జరిగిన ఐపీఎల్ మెగావేలంలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ జాక్‌పాట్ కొట్టారు. ఢిల్లీ నుంచి బయటకు వచ్చిన పంత్‌ను ఏకంగా 27 కోట్లకు లక్నో కైవసం చేసుకుంది. దీంతో సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరగా రికార్డుయ్యింది. ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను 26.75 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. కేకేఆర్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ను 23.75 కోట్లకు తిరిగి అదే జట్టు తీసుకోగా, అర్ష్‌దీప్‌సింగ్, యజువేంద్ర చాహల్ 18 కోట్లతో పంజాబ్ జట్టులోకి వచ్చారు. మహమ్మద్ షమీని హైదరాబాద్, సిరాజ్‌ని గుజరాత్ సొంతం చేసుకున్నాయి.